మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ''దేశ భద్రతను పరిగణనలోకి తీసుకుంటే మనం అంత అదృష్టవంతులం కాదు. ఎందుకంటే ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాకుండా అంతర్గతంగానూ భద్రతా పరమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితి పట్ల ఆందోళన లేకుండా నిశ్శబ్దంగా కూర్చోలేం. శత్రువులు కార్యకలాపాలపై మరింత నిఘా అవసరం. వారి కదలికలను గమనిస్తూనే ఉండాలి. అప్పుడే వారి కుట్రను భగ్నం చేయగలం'' అని అన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకమని అన్నారు. ''రక్షణమంత్రిగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు తీసుకుంటున్న కఠినమైన శిక్షణతో పాటు మీ అంకితభావాన్ని చూశాను. దేశం పట్ల బాధ్యతాయుతమైన మీ తీరు మాలో స్ఫూర్తి నింపుతోంది '' అని అన్నారు.
భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకం !
الأحد، 29 ديسمبر 2024
national కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకం మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించి
ليست هناك تعليقات:
إرسال تعليق