అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి మృతి చెందింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022 డిసెంబర్‌లో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలోని ఒక యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతోంది. గత శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో ట్రక్ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. నాగశ్రీ వందన పరిమళతో పాటు స్నేహితులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నాగశ్రీ వందన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో నాగశ్రీ వందన స్నేహితులు నికిత్, పవన్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నికిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, పవన్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలిసింది.
إرسال تعليق