హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఓ కారు అతివేగంగా వచ్చి బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న దంపతులు కన్నుమూశారు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా మోద్కురుకు చెందిన ప్రణయ్‌గా తేల్చారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగంతో రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత కారు నడిపిన ప్రణయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడికి డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్లు తెలిసింది. మృతులను దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్‌లుగా పోలీసులు గుర్తించారు. దంపతులు బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో నివాసం ఉంటున్నారని తెలిసింది. లంగర్ హౌస్‌లోని యాదవ బస్తీలో మోనా ఠాకూర్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మొనా ఠాకూర్ రెండు నెలల గర్భిణి. 

Post a Comment

أحدث أقدم