హీరో స్ప్లెండర్ బైక్ ను ఎలెక్ట్రిక్ వేరియంట్ రిలీజ్ చేశారు. ఐతే పాత స్ప్లెండర్ ఉన్న వారికి ఎలెక్ట్రిక్ స్ప్లెండర్ కోసం కొత్త ఆఫర్ ఇస్తున్నారు. హీరో కంపెనీ మీ దగ్గర ఉన్న బైక్ ను తక్కువ ధరకే ఎలెక్ట్రిక్ బైక్ గా మారుస్తుంది. కన్వర్షన్ కిట్ కోసం హీరో మోటార్ ని సంప్రదిస్తే సరిపోతుంది. ఇది కాకుండా బైక్ అధిక సామర్హ్యం గల బ్యాటరీ ప్యాక్, కంట్రోలర్ యూనిట్ ఇంకా అవసరమైన వైరింగ్ లను కూడా పూర్తి చేస్తారు. దేశంలో ఇప్పటికే ఇలాంటి బైక్ లు ఆర్.టి.ఓ కన్వర్షన్ కిట్ తో రీమోడల్ చేయబడ్డాయి. వీటికి ఎలాంటి చట్టపరమైన సమస్య ఉండదు. మీ దగ్గర ఉన్న స్ప్లెండర్ బైక్ ను ఎలెక్ట్రిక్ బైక్ గా మార్చే అవకాశం ఉంది. ఈ ఎలెక్ట్రిక్ బైక్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 151 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. హీరో బైక్ ను ఎలెక్ట్రిక్ బైక్ గా కేవలం 35000 ఇంకా బ్యాటరీతో సహా అయితే 95000 రూపాయలతో మార్చవచ్చు.

Post a Comment

أحدث أقدم