మహారాష్ట్రలోని తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి మూడేళ్ల వయసున్న ఓ ఆడ పులిని ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అయితే, డిసెంబరు 8న ఆ పులి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకుని పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది. ఒక వారం పాటు ఝార్ఖండ్‌లో సంచరించి, అనంతరం పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఆ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఆదివారం ఫలించాయి. బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి దాన్ని బంధించారు. పులిని పట్టుకోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. టీం వర్క్, వన్యప్రాణుల సంరక్షణ పట్ల అంకితభావానికి ఈ ఘటన ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
తప్పించుకున్న ఆడ పులి ఎట్టకేలకు చిక్కింది !
الاثنين، 30 ديسمبر 2024
maharashtra west bengal ఝార్ఖండ్ తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఎట్టకేలకు చిక్కింది మత్తు మందు ఇచ్చి బంధించారు
ليست هناك تعليقات:
إرسال تعليق