ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెన్షన్ల తనిఖీని చేపట్టనుంది. ముఖ్యంగా వికలాంగులు అలాగే ఇతర కేటగిరలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే తప్పుడు పత్రాలతో లబ్ధి పొందుతున్న వారిని ఏరి వేయనున్నారు. తొలి విడతలో ఒక్కో గ్రామ అలాగే వార్డు సచివాలయ పరిధిలో ఉన్న లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి దివ్యాంగులు అలాగే ఇతర కేటగిరీలో ఉన్న అనర్హుల లిస్టును వెలికి తీయనుంది. దీనికోసం మండలానికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించనుంది. ఒక బృందానికి 40 పింఛన్ల ను పరిశీలించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల అనర్హుల ఏరివేత ?
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق