కౌన్ బనేగా కరోడ్ పతి హిందీ 16 ప్రోగ్రాంలో కంటెస్టెంట్ తనకి అల్లు అర్జున్ తోపాటూ అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని దీంతో సినిమాలు కచ్చితంగా చూస్తానని తెలిపింది. దీంతో అమితాబ్ బచ్చన్ ఈ విషయంపై స్పందిస్తూ అల్లు అర్జున్ కి నేను కూడా వీరాభిమానిని అని అన్నాడు. అలాగే బన్నీ టాలెంటెడ్ యాక్టర్ అని, అతనికి దక్కిన అవార్డులకి అర్హుడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే అల్లు అర్జున్ తో నన్ను పోల్చి చూడకండని అన్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా రిలీజ్ అయ్యిందని ఒకవేళ మీరు ఆ సినిమా చూడకుంటే కచ్చితంగా చూడాలని కంటెస్టెంట్ కి సూచించాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ లెజండరీ యాక్టర్ అని, అటువంటి గొప్ప నటుడి నుంచి ప్రసంశలు అందుకోవడం గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తన్నారు.
0 Comments