క్షత్రియ వర్గాన్ని అవమానించారంటూ పుష్ప-2 నిర్మాతలకు బెదిరింపులు ?

                                                            

పుష్ప-2 మూవీలో షెకావత్ అనే పేరుతో ఉన్న పాత్రను నెగిటివ్ గా చూపించి, తమ క్షత్రియ వర్గాన్ని అవమానించారు అంటూ క్షత్రియ కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణి సైనికుల్లారా సిద్ధంగా ఉండండి. పుష్ప-2 నిర్మాతలపై దాడి చేద్దాం అంటూ రాజ్ షెకావత్ పిలుపునిచ్చారు. పుష్ప సినిమా విడుదలై మూడు సంవత్సరాలు అయింది. ఆ సమయంలోనే షెకావత్ పాత్ర వచ్చింది. పార్ట్ 1లోనే షెకావత్ వస్తే.. మూడేల్ల పాటు ఏం చేశారని, ఇప్పుడు సంచలన విజయం సాధిస్తుందని.. దానికి బ్రేక్ వేయాలని ఏదో కుట్ర చేస్తున్నారని ఫ్యాన్స్ పేర్కొనడం గమనార్హం.

Post a Comment

0 Comments