గుజరాత్‍లోని ఆనంద్ జిల్లాలో ప్రతిష్ఠాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మంగళవారం నాడు కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకోవడంతో స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిన సమాచారం తెలియగానే ఆనంద్ పోలీసులు, బ్రిగేట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్చలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇద్దరు కార్మికులను రక్షించారని, మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారని ప్రాథమిక సమాచారం. మహి నది వద్ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు స్థలంలో కాంక్రీట్ బ్లాక్ల మధ్య ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయారని, క్రేన్లు, ఎక్స్కవేటర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని 'నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్' సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. ఒక కార్మికుడిని కాపాడి ఆస్పత్రికి తరలించినట్టు తెలిపింది. కాగా, నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలడంపై అధికారులు విచారణ ప్రారంభించారు. నిర్మాణ సంబంధిత కారణాల వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ, పూర్తి విచారణ అనంతరమే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముంబై-అహ్మదాబాద్ ను కలిపే ఈ హైప్రొఫైల్ బుల్లెట్ ప్రాజెక్టులో భాగంగానే ఈ వంతనె నిర్మాణం జరుగుతోంది. భారతదేశ రైల్వే చరిత్రలోనే రివల్యూషనరీ ప్రాజెక్టుగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును భావిస్తుండగా, భూసేకరణకు సంబంధించిన పలు వివాదాలతో సహా అనేక సవాళ్లతో నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది.
గుజరాత్లో కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి !
الثلاثاء، 5 نوفمبر 2024
national గుజరాత్లో కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కార్మికులు
ليست هناك تعليقات:
إرسال تعليق