కమలా కాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది నిమ్మ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయిలానే సిట్రస్ జాతికి చెందినది. దీనిలో విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బాధపడతారు. శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందదు. ఈ పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కమలా పండుతో ఉన్నాయి. అయితే, కమలా పండును కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు. చలి కాలంలో జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు కమలా పండ్లు తినకూడదు. ఇలాంటి వారు కమలా పండ్లు తినడం వల్ల జలుబు తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పొడి దగ్గు ఉన్నవారు వీటి జోలికి పోకపోవడమే మంచిది. వీరు తింటే ఉన్న దగ్గు కాస్తా తీవ్రమైంది. ఆ తర్వాత ఊపిరాడదు. అంతేకాకుండా జలుబు, దగ్గు ఉన్నవారు కమలా పండ్లు తినడం వల్ల గొంతునొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కమలా పండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను తినకూడదు. ఎక్కువ తింటే జీర్ణశక్తి ప్రభావితం అయ్యే ప్రమాదముంది. దీంతో పొత్తి కడుపు తిమ్మరి, ఉబ్బరం, కడుపు నొప్పి, అతిసారానికి దారి తీయవచ్చు. ఈ పండు ఎక్కువగా తిన్నా వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లు తినకూడదు. అలర్జీ, శ్వాసకోస వ్యాధులతో బాధపడే వారు కమలా పండ్ల వినియోగం తగ్గించుకోవాలి. ఈ పండ్లను ఎక్కువ తినడం వల్ల ఇలాంటి వారికి అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మంపై ఎర్రటి మచ్చలు, మంట, దద్ధుర్లు వచ్చే ప్రమాదముంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను తినకపోవడమే మంచిదంటున్నారు. ఎసిడిటీ సమస్యలతో బాధపడే వారు కమలా పండ్లు తినకూడదు. యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్న వ్యక్తులు కమలాలను అధికంగా తినడం వల్ల గుండె మంట సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను ఎక్కువగా తినకూడదు.
కమలా పండ్లు - అలర్జీ సమస్యలు !
الأربعاء، 27 نوفمبر 2024
arogyam Health Tips కమలా పండ్లు - అలర్జీ సమస్యలు చర్మంపై ఎర్రటి మచ్చలు జలుబు దగ్గు సమస్యలతో బాధపడేవారు దద్ధుర్లు వచ్చే ప్రమాదం మంట
ليست هناك تعليقات:
إرسال تعليق