ణపాయ ఆకులు కిడ్నీల సమస్యలు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడర్‌లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. ఈ ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వీటిని తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు. జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే హితకరంగా ఉంటుంది. ఈ ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకులను తింటే జుట్టు రాలడం తగ్గుతుందది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది. రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి కట్టు కడుతుంటే కొవ్వు గడ్డలు, వేడి కురుపులు తగ్గుతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి. కామెర్లు ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి నయం అవుతుంది. ఈ ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది.

Post a Comment

أحدث أقدم