ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. గార్లదిన్నె మండలం కలగాసపల్లె వద్ద ఆర్టీసీ బస్సు వ్యవసాయ కూలీలు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఇద్దరు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. గాయపడ్డ మరికొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

أحدث أقدم