కీర్తి సురేష్ కు ఆంటోని తటిల్ తో వివాహం !


కీర్తి సురేష్ కు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్ తోనే వివాహం జరగబోతోందని ఆమె తండ్రి అధికారికంగా చెప్పారు. గోవాలోని ఓ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరుగుతుందన్నారు. డిసెంబరు 11 లేదంటే 12వ తేదీన వీరి వివాహం జరగబోతోంది. నెటిజన్లు కీర్తిసురేష్ - ఆంటోని తటిల్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు నేను శైలజ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత 'నేను లోకల్', 'మహానటి', 'అజ్ఞాత వాసి', 'దసరా', 'మిస్ ఇండియా' వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మహానటి సినిమా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని చెప్పొచ్చు. దీంతోపాటు దసరా చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనపరిచింది. ఈ రెండు సినిమాలు ఆమెకు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని గోవాలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయికానీ అవన్నీ రూమర్లే అనుకున్నారు. అయితే ఆమె తండ్రి సురేష్ కుమార్ ఈ వివాహాన్ని అధికారికంగా ప్రకటించడంతో వాస్తవమే అని ధృవీకరణకు వచ్చారు. 

Post a Comment

0 Comments