ఐఐటీ ఢిల్లీ విద్యార్థి క్యాంపస్‌లోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని డియోగఢ్‌కు చెందిన 21 ఏళ్ల కుమార్ యాష్, ఐఐటీ ఢిల్లీలో ఎంఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్నేహితుడు, అక్కడి సిబ్బంది కిటికీని పగులగొట్టి గదిలోకి వెళ్లారు. రెండు టవల్స్‌తో ఉరి వేసుకున్న కుమార్‌ను కిందకు దించారు. వెంటనే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించగా ఆ విద్యార్థి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌కు చేరుకున్నారు. స్టూడెంట్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీస్ అధికారి తెలిపారు. అయితే మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్న మెడికల్ కార్డు ఆ రూమ్‌లో ఉన్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం కూడా మానసిక చికిత్స కోసం ఐఐటీలోని హాస్పిటల్‌కు అతడు వెళ్లినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య !
الخميس، 24 أكتوبر 2024
Criem New Delhi ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్నాడని పోలీసులు ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య జార్ఖండ్‌లోని డియోగఢ్‌కు చెందిన 21 ఏళ్ల కుమార్ యాష్
ليست هناك تعليقات:
إرسال تعليق