కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేశారు. కేరళలోని వయనాడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో వయనాడ్‌కు రాజీనామా చేశారు. తాజాగా వయనాడ్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. నవంబర్ 13న ఉప ఎన్నిక జరుగనుంది. వయనాడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా 48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నిక జరుగనుంది. వీటన్నింటికి అక్టోబర్ 18న నోటిఫికేషన్, నవంబర్ 13న ఉప ఎన్నిక, నవంబర్ 23న ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం విశేషం.
إرسال تعليق