Ad Code

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి పాకిస్తాన్ వెళ్లనున్న ఎస్. జైశంకర్ !


పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. గత ఏడాది ఈ సమావేశానికి మన దేశమే అతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. గోవాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పడు ఈ మీటింగ్ కి అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు. అయితే ఈ ఏడాది పాకిస్తాన్ లో జరగనున్న ఈ సమావేశానికి భారత్ తరఫున వెళ్లాలా ? వద్దా ? అనే దానిపై గత కొన్నిరోజులుగా చర్చలు జరిగాయి. చివరికి కేంద్రమంత్రి జైశంకర్ ఈ మీటింగ్ వెళ్లనున్నారని.. విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఒక విదేశాంగశాఖ మంత్రిగా జైశంకర్ పాకిస్తాన్ కు వెళ్లనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, అలాగే ఉజ్బెకిస్థాన్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతీఏడాది ఒక్కో దేశంలో ఈ సమావేశాలు జరగుతుంటాయి. రొటేషన్ పద్ధతిలో భాగంగా ఈసారి పాకిస్థాన్కు అతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఆగస్టులోనే ఎస్సీఓ మీటింగ్కు హాజరుకావాలని ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. దీనిపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో జైశంకర్ ప్రకటించారు. కానీ ఎట్టకేలకు జైశంకరే ఈ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రతినిధి బృందం తరఫున నాయకత్వం వహిస్తారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్ కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఆమె ఇస్లామాబాద్కు వెళ్లారు. ఇదిలాఉండగా.. ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, అలాగే ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.


Post a Comment

0 Comments

Close Menu