భద్రత కల్పించి బండి సంజయ్‌తో ర్యాలీ చేయించారు !


ప్రభుత్వం గ్రూప్‌-1 అభ్యర్థుల్ని చిన్నచూపు చూస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అభ్యర్థుల్ని చర్చలకు పిలవకపోవడం దుర్మార్గమని, కనీసం సుప్రీం కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి కావాలనే నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ''భద్రత కల్పించి మరీ సంజయ్‌తో ర్యాలీ చేయించారు. భారాస నాయకులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుంది? సంజయ్‌ ఏం చదివారు? పరీక్షల గురించి ఆయనకేం తెలుసు? పరీక్షపత్రాలు లీక్‌ చేయించే సంజయ్‌ గ్రూప్‌-1 గురించి ఏం మాట్లాడతారు?'' అని కేటీఆర్‌ విమర్శించారు.

Post a Comment

0 Comments