Ad Code

క్యాబ్‌లో నో రొమాన్స్ అంటూ డ్రైవర్ నోటీసు బోర్డు !


హైదరాబాద్‌కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ వార్నింగ్ అంటూ కారులో తన సీటు వెనుక బోర్డు పెట్టాడు. క్యాబ్‌లో నో రొమాన్స్ అంటూ రాసిపెట్టాడు. ఏదైనా ప్రైవేటు స్థలంలోనైనా లేదంటే ఓయో హోటల్స్‌లోనైనా రొమాన్స్ చేసుకోవాలంటూ సూచించాడు. తన కారులో మాత్రం దూరం పాటించాలని హెచ్చరించాడు. ముఖ్యంగా జంటలను ఉద్దేశించి ఈ బోర్డు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చిన బోర్డు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ప్రయాణికులు ప్రశాంతంగా ఉండాలని.. ఒకరికొకరు దూరం పాటించాలని సలహా ఇచ్చాడు. ప్రత్యేకంగా జంటలను ఉద్దేశించి ఈ సందేశం ఉంచాడు. తన క్యాబ్‌లో శృంగారానికి చోటు లేదన్నాడు. వెంకటేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా… ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు నైతికంగా, అవసరమైన సందేశం అని తెలిపాడు. మరొకరు.. ఇలాంటి బోర్డులు బెంగళూరు, ఢిల్లీలో చూశానని, హైదరాబాద్‌లో కూడా ఇంత త్వరగా రావడం ఊహించలేదన్నారు. ఇదిలా ఉంటే గత వారమే బెంగళూరు క్యాబ్ డ్రైవర్ కూడా ఇదే రకమైన బోర్డు పెట్టడంతో వైరల్ అయింది.

Post a Comment

0 Comments

Close Menu