పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24పరగణాస్ జిల్లాలో కోచింగ్ సెంటర్‌కు వెళ్లి అదృశ్యమైన ఓ మైనర్ బాలిక ఒంటి నిండా గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. కాగా, ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు మోస్తకిన్ సర్దార్ (19) బాలికను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో, చంపేసి కాలువలో పడేసినట్లుగా నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి కొద్ది రోజుల ముందు నుంచి నిందితుడు బాలిక స్కూల్‌కు వెళ్తున్న సమయంలో ఐస్ క్రీంలు ఇస్తూ పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా సైకిల్‌పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లాడని తెలిపారు. బెంగాల్‌లోని దక్షిణ 24పరగణాస్ జిల్లాకు చెందిన బాలిక కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటినుంచి వెళ్లింది. రాత్రయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. శనివారం తెల్లవారుజామున ఒంటినిండా గాయాలతో ఆమె మృతదేహం పొలంలో లభ్యం కావడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కర్రలతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, అవుట్ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు. మహిళల భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష భాజపా ఆందోళన చేపట్టడంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
పశ్చిమ బెంగాల్లో అత్యాచారాన్ని ప్రతిఘటించిందని బాలిక దారుణ హత్య ?
الأحد، 6 أكتوبر 2024
Criem చంపేసి కాలువలో పడేసినట్లుగా నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం పశ్చిమ బెంగాల్లో అత్యాచారాన్ని ప్రతిఘటించిందని బాలిక దారుణ హత్య ? పోలీసుల అదుపులో అనుమానితుడు
ليست هناك تعليقات:
إرسال تعليق