ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ యూనియన్ బ్యాంక్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ను ఎవరూ నమ్మొద్దని యూనియన్ బ్యాంక్ అధికారులు సూచించారు. ఆధార్ అప్డేట్ చేసుకోండి, లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందంటూ చాలా మందికి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయన్నారు. మెసేజ్లోని ఆ యాప్ను డౌన్లోడ్ గానీ ఓపెన్ గానీ చేస్తే వెంటనే ఫోన్ హ్యాక్ అయి హ్యాకర్ల చేతి వెళ్తుందన్నారు. బేగంపేటకు చెందిన ఓ ఖాతాదారుడు ఈ యాప్ లింక్ను ఓపెన్ చేయడంతో ఖాతాలో రూ.28 వేలు డ్రా అయ్యాయి. దీంతో సదరు ఖాతాదారుడు బ్యాంకు అధికారులను సంప్రదించి సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.
إرسال تعليق