Ad Code

ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు !


ఏక్తా కపూర్‌ నిర్మించిన ఆల్ట్‌ బాలాజీ బోల్డ్‌ కంటెంట్‌ 'గంధీభాత్‌' వెబ్‌ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వెబ్‌ సిరీస్‌ సీజన్‌-6లోని ఓ ఎపిసోడ్‌లో మైనర్‌ బాలికల అశ్లీల దృశ్యాల నేపథ్యంలో ఏక్తా కపూర్‌తో పాటు శోభా కపూర్‌పై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ముంబయి బోరివాలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య ఆల్ట్‌ బాలాజీలో ప్రసారమైన గంధీభాత్‌ వెబ్‌ సిరీస్‌లో మైనర్‌ బాలికలను అభ్యంతరకర సన్నివేశాల్లో చూపించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే, ఈ సిరీస్‌ ప్రసారం నుంచి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదస్పద ఎపిసోడ్‌ని యాప్‌లో స్ట్రీమింగ్‌ నుంచి తొలగించారు. గొప్ప వ్యక్తులతో పాటు సాధువులను సైతం అవమానించారని సదరు వ్యక్తి ఆరోపించారు. సన్నివేశాలు అభ్యంతరకరమని.. మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. పోక్సో నిబంధనలు ఉల్లంఘించే సన్నివేశాలు ఉన్నాయన్నారు. పోక్సోతో పాటు సమాచార సాంకేతిక చట్టం-2000, మహిళా నిషేధ చట్టం 1986, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 తదితర చట్టాలను ఉల్లంఘించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పిల్లలకు సంబంధించి అభ్యంతర కంటెంట్‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పిల్లల అశ్లీల కంటెంట్‌ చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేయడం నేరమేననని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu