రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు !

الجمعة، 4 أكتوبر 2024

weather తెలంగాణల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ

t f B! P L


బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ అయింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం నమోదైంది. గత కొద్దిరోజుల నుంచి ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. భరించలేని ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు శనివారం నాడు నిజామాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలు, కామారెడ్డి, మెదక్, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ