'లగ్గం' సినిమా మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చీరల పండుగ పేరుతో రీల్ పెట్టు - చీర పట్టు అనే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. ఆసక్తి కలిగిన యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్గం సినిమాకు సంబందించి పాటలకు గానీ లేదా టీజర్ లో డైలాగ్స్ కు గాని తమ స్టైల్ లో రీల్ లేదా యూట్యూబ్ షాట్ చేసి 8885050729 నెంబర్ కు పంపితే చీర ను గిఫ్ట్ గా అందిస్తారట. అయితే ఈ బహుమతి పొందాలంటే.. వారి అకౌంట్ లో పోస్ట్ చేసి లగ్గం పేజీ కి టాక్ చెయ్యాలట. లగ్గం తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమా. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్ బీ శ్రీరామ్, కృష్ణుడు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది.
'లగ్గం' సినిమా మేకర్స్ వినూత్న ప్రమోషన్ !
الثلاثاء، 8 أكتوبر 2024
'లగ్గం' సినిమా మేకర్స్ వినూత్న ప్రమోషన్ cinema అక్టోబర్ 25న విడుదల రీల్ పెట్టు - చీర పట్టు అనే కార్యక్రమం లగ్గం తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమా
ليست هناك تعليقات:
إرسال تعليق