మాస్‌ చెరలోని ఐదుగురు బందీలను విడుదల చేస్తే, రెండు వారాల కాల్పుల విరమణకు తాము సిద్ధమని ఇజ్రాయెల్‌ చెబుతోంది. దీంతో పాటు మిగతా బందీల విడుదల, యుద్ధం ముగింపునకు సంబంధించిన ప్రతిపాదనలపైనా ఆదివారం జరిగిన ఇజ్రాయెల్‌ భద్రతా క్యాబినెట్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. సిన్వర్‌ మృతి చెందినా హమాస్‌ మాత్రం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. గతంలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందమే అమలు జరపాలని పట్టుబడుతోంది. కొత్త ప్రతిపాదనలకు ఆ సంస్థ సిద్ధంగా లేదని చర్చలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కీలక వ్యక్తులు చెబుతున్నారు. మరోవైపు లెబనాన్‌పై దాడులను ఆపేందుకు తాము సిద్ధమన్న సందేశాన్ని అమెరికాకు ఇజ్రాయెల్‌ పంపింది. అయితే అందుకు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. లెబనాన్‌ గగనతలాన్ని తమకు అప్పగించాలని.. అంతేకాకుండా ఐడీఎఫ్‌ దళాల ప్రవేశానికీ అనుమతి ఇవ్వాలని కోరుతోంది. ఈ ప్రతిపాదనలను గతవారమే అమెరికాకు టెల్‌ అవీవ్‌ పంపినట్లు ఓ పత్రిక పేర్కొంది. మరోవైపు లెబనాన్‌కు ఇజ్రాయెల్‌ క్షమాపణ చెప్పింది. ఆదివారం ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో ముగ్గురు లెబనాన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు ఉన్న వాహనం హెజ్‌బొల్లా గ్రూపుదిగా భావించి పొరపాటున దాడి చేశామని పేర్కొంది. తమ లక్ష్యం.. లెబనాన్‌ సైన్యం కాదని వివరణ ఇచ్చింది. ఇరాన్‌ తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఏడుగురు పౌరులను సోమవారం ఇజ్రాయెల్‌ అరెస్ట్‌ చేసింది. ఆ ఏడుగురికి భారీ మొత్తంలో ఇరాన్‌ నగదు ముట్టజెప్పినట్లు పేర్కొంది.

Post a Comment

أحدث أقدم