కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తారు. పూర్వం నుంచి కర్పూరాన్ని ఆరోగ్యం పెంచుకోవడంలో ఉపయోగిస్తూ ఉంటున్నారు. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే ఆరోగ్యం, అందం రెండు విధాల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ బయోటిక్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని నీటిలో వేసి స్నానం చేస్తే దురద, దద్దుర్లు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు దరిచేరవు. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది సహజ బ్యూటీ ప్రాడెక్ట్‌గా పని చేస్తుంది. స్నానం చేసేటప్పుడు కర్పూరం నుంచి వచ్చే వాసనతో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధ పడేవారు రెగ్యులర్‌గా స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. గోరు వెచ్చటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే అలసట, నీరసం తగ్గుతాయి. యాక్టీవ్‌గా మారతారు. కొత్తగా శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఈ నీళ్ల నుంచి మంచి ఆరోమా వస్తుంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా రాత్రి పూట చేస్తే మంచిగా నిద్ర పడుతుంది.
0 Comments