ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని, సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో మంగళవారం భేటీ కానున్నారు. బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు.. ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. రైల్వే జోన్, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశముంది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు కోరనున్నట్టు సమాచారం.
إرسال تعليق