హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తామని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జింద్ జిల్లా దేవేరార్ గ్రామానికి చెందిన అజ్మీర్‌గా గుర్తించారు. జులానాలోని వాట్సాప్ గ్రూపులో హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 08న హర్యానాలో ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో అజ్మీర్ వాట్సాప్ గ్రూపులో బెదిరించినట్లు జింద్ ఎస్పీ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ విషయం పోలీసులు దృష్టికి వచ్చిన వెంటనే అజ్మీర్‌ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హర్యానాలోని జులానా నియోజకవర్గం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేష్ ఫోగట్ పోటీ చేశారు. ఆమె తన ప్రత్యర్థి, బీజేపీకి పార్టీకి చెందిన యోగేష్ కుమార్‌ని 6015 ఓట్ల తేడాతో ఓడించారు. మొత్తంగా హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లను గెలుచుకుని మరోసారి అధికారం చేపట్టబోతోంది. మరోవైపు కాంగ్రెస్ 37 సీట్లకే పరమితమైంది. వరసగా మూడోసారి హర్యానా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఈ రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కి చివరకు నిరాశే మిగిలింది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ