తెలంగాణలోని మెదక్ జిల్లా శివంపేటలోబుధవారం మధ్యాహ్నం కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని రత్నాపూర్ వద్ద కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. డ్రైవర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు కారును వెలికితీసి డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. మృతులు రత్నాపూర్, తాళ్లపల్లి, పాముతండా వాసులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో ఓ వ్యక్తి, నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం !
الأربعاء، 16 أكتوبر 2024
Criem telangana అదుపు తప్పి కల్వర్టును ఢీకొని రత్నాపూర్ వద్ద కాలువలోకి దూసుకెళ్లింది కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం మెదక్ జిల్లా శివంపేటలో
ليست هناك تعليقات:
إرسال تعليق