ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో స్కూటీపై బాణాసంచా తరలిస్తుండగా అవి ఆకస్మాత్తుగా పేలడంతో ఓ యువకుడు మృతి చెందాడు. తూర్పు వీధి గౌరీ దేవీ గుడి వద్ద ప్రమాదం జరిగింది. పండుగ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బస్తాలో బాణాసంచా తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఓ యువకుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
إرسال تعليق