టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు తనను చంపేందుకు ప్రయత్నించారని పెద్దారెడ్డి తెలిపారు. మా అన్న కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డిని 2006లో చంపారు. జేసీ గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ, సహకారాలు అందజేస్తున్నారు. ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేసారు. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. యాడికి మండలంలో జేసీ ముఠా బరితెగించింది. త్వరలోనే యాడికి మండలంలో నాలుగు వైన్స్ షాపులు ప్రారంభం కానున్నాయి. మద్యం షాపు కోసం చేసిన దరఖాస్తును విరమించుకోవాలని జేసీ ముఠా వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు.
إرسال تعليق