కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ రాశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు పేర్కొన్న జీవన్ రెడ్డి, తన రాజకీయ భవిష్యత్ పై మీరే నిర్దేశించండి అని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలకంగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. పదేళ్లు బీఆర్ఎస్ పై పోరాడానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే నా అనుచరుడిని కిరాతకంగా చంపేశాడని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాని మానసిక ఆవేదనలో ఉన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ !
الخميس، 24 أكتوبر 2024
telangana కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్న ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ
ليست هناك تعليقات:
إرسال تعليق