ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదని తెలిపారు. హర్యానా ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హర్యానా ఫలితాలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. మూడు జిల్లాల నుంచి చాలా సీరియస్‌గా ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఫలితాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. బీజేపీ ఫలితాలను తారుమారు చేసి విజయాన్ని సాధించిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. ఇక జమ్మూకాశ్మీర్‌లో ప్రజలు స్పష్టమైన విజయాన్ని ఇచ్చారని జైరాం రమేష్ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నం చేసిందన్నారు. ఇక్కడ ప్రజలు కూటమికి స్పష్టమైన తీర్పు ఇచ్చారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదు : జైరాం రమేష్
الثلاثاء، 8 أكتوبر 2024
national మీడియాతో జైరాం రమేష్ మూడు జిల్లాల నుంచి చాలా సీరియస్‌గా ఫిర్యాదులు వచ్చినట్లు హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదు
ليست هناك تعليقات:
إرسال تعليق