భారత్ 4జీ విధానానికి అనుగుణంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ 'కార్బన్ మొబైల్స్'తో జతకట్టినట్టు ఎక్స్ వేదికగా బీఎస్ఎన్‌ఎల్ ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వస్తే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు అవసరం లేకుండానే 4జీ సేవలను పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కీలకమైన ఈ ఒప్పందంలో భాగంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్లను అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించింది. కార్బన్ మొబైల్స్ తో కలిసి దేశంలో ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఈ మేరకు కార్బన్ మొబైల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని ప్రకటనలో బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కంపెనీ వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబర్ 1న కీలక ప్రకటన చేసింది. కాగా ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఫోన్లు జియో భారత్ 4జీ ఫీచర్ ఫోన్లతో పోటీ పడనున్నాయి. సరసమైన ధరల్లోనే హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే అవకాశాలు ఉన్నాయి.
4జీ మొబైల్ హ్యాండ్ సెట్ కోసం కార్బన్ మొబైల్స్ జత కట్టిన బీఎస్ఎన్ఎల్ !
الخميس، 3 أكتوبر 2024
4జీ మొబైల్ హ్యాండ్ సెట్ కోసం కార్బన్ మొబైల్స్ జత కట్టిన బీఎస్ఎన్ఎల్ science technology ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ ఫోన్లను భారత్ 4జీ విధానానికి అనుగుణంగా
ليست هناك تعليقات:
إرسال تعليق