హైదరాబాద్ మహానగరం వాసులకు ఈనెల 24వ తేదీన తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి వర్గాలు ప్రకటన కూడా విడుదల చేసింది. కృష్ణ వాటర్ ఫేజ్ 3 పంపింగ్ మెయిన్ లీకేజీ మరమ్మత్తుల పనులు కొనసాగుతున్నాయి. ఈ మనమత్తుల పనులు కొనసాగుతున్న తరుణంలో నీటి సరపరాకు అంతరాయం కలగనుంది. ఆరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జలమండలి ప్రకటన చేసింది. శాస్త్రి పురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట, ఆళ్ల బండ, జూబ్లీహిల్స్ ఫిలింనగర్, ప్రసవన్ నగర్, తట్టికాన, లాలాపేట, సాహెబ్ నగర్ లాంటి ప్రాంతాలలో మంచినీరు రాదని తెలిపింది.
إرسال تعليق