దేశీయ మార్కెట్‌లో హానర్ ప్యాడ్ X8s నాదల్ కిడ్స్ ఎడిషన్ పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ట్యాబ్లెట్ విడుదలైంది. సిలికాన్ కేస్, షాక్‌ప్రూఫ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హానర్ ట్యాబ్లెట్ ఐ కంఫర్ట్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా బ్లూ లైట్ నుంచి చిన్నారుల కంటిని సురక్షితంగా ఉంచుతుంది. హానర్ చిల్డ్రన్ ఎడిషన్ 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 1290*1200 పిక్సల్స్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్‌తో విడుదల కానుంది. ఈ ట్యాబ్లెట్‌ను ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నా్ప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ పై పనిచేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 14 MagicOS 8.0 ను కలిగి ఉంది. హానర్ ప్యాడ్ X8s నాదల్ కిడ్స్ ఎడిషన్ 64GB, 128GB స్టోరేజీ వేరియంట్‌ల అందుబాటులో ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 5MP ప్రధాన కెమెరాతోపాటు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ కోసం ముందస్తుగా సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ యాంటీ షాక్ మరియు హ్యాండిల్, స్కెచ్, వీడియో మోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ గూగుల్ కిడ్స్ స్పేస్ ఫీచర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. మరియు Doodle Pen ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హానర్ ట్యాబ్లెట్ 8300mAh బ్యాటరీతో పని చేస్తుంది.
హానర్ ప్యాడ్ X8s నాదల్ కిడ్స్ ఎడిషన్ విడుదల !
الاثنين، 30 سبتمبر 2024
1290*1200 పిక్సల్స్ రిజల్యూషన్ 90Hz రీఫ్రెష్ రేట్ science technology ఆండ్రాయిడ్ 14 MagicOS 8.0 హానర్ ప్యాడ్ X8s నాదల్ కిడ్స్ ఎడిషన్ విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق