ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు జిల్లా కీలకనేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. బాలినేని పార్టీ నుంచి వీడుతున్నట్లుగా గత కొంతకాలంగా వస్తున్న ప్రచారాన్ని నిజం చేశారు. బాలినేని జనసేన పార్టీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు విజయవాడలో పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని సమాచారం. భేటీ అనంతరం పార్టీలో ఎప్పుడు చేరేది లేనిది ప్రకటిస్తారని తెలుస్తోంది. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపారు.పార్టీ అధినేత నిర్ణయాలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బాలినేని జగన్ నిర్ణయాలు సరిగాలేనప్పుడు విభేదించానన్నారు. కొన్ని కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అందుకే వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో కీలకనేత మాత్రమే కాదు జగన్ కు బంధువు కూడా అవుతారు. గతంలో ఒంగోలు అసెంబ్లీ నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జగన్ క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నప్పటికి.. క్యాబినెట్ మార్పులో బాలినేని పేరు తొలగించడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో 2014లో మాత్రమే బాలినేని వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా ఉంది. రేపు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన తర్వాత ఎప్పుడు పార్టీలో చేరేది లేనిది ప్రకటిస్తారని తెలుస్తోంది.
إرسال تعليق