హైదరాబాద్ లోని హిమాయత్‌నగర్‌ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూలను గతంలో విక్రయించే వారు. ఈ లడ్డూ ప్రసాదం ఇకపై రోజూ అందుబాటులో ఉంటుందని తితిదే ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, ఎన్.నిరంజన్‌కుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి లడ్డూ జారీలో తితిదే కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పవిత్రమైన శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం (రూ.50కి ఒక లడ్డూ) రోజూ అందజేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్ ఆలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.

Post a Comment

أحدث أقدم