ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కోసమే ఉంటుందని తెలిపారు. అందుకోసమే మరో కుర్చీ వేసుకొని కూర్చున్నాను అని తెలిపారు. కేజ్రీవాల్ కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చీని.. ఆయన కోసం ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు.
వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషీ !
الاثنين، 23 سبتمبر 2024
national New Delhi అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషీ
ليست هناك تعليقات:
إرسال تعليق