వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పిఠాపురం నియోజక వర్గంలో మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. తాజాగా పిఠాపురం వరద బాధితులను ఆదుకునేందుకు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది బాధితులకు ఆర్థిక సహాయం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. అయితే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం లో పర్యటించిన సందర్భంగా ముద్ర గడ పద్మనాభం మాత్రం కనిపించలేదు. ఆయన సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే ముద్రగడ పద్మనాభం రాకపోవడంతో అందరిలోనూ కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ముద్రగడ పద్మనాభం గుడ్ బై చెప్పారా అని కొంతమంది అంటున్నారు. లేక రాజకీయాల నుంచి ముద్ర గడ పద్మనాభం పూర్తిగా తప్పుకున్నారా అని కూడా కొంతమంది అంటున్నారు.
إرسال تعليق