వైకాపా సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ కాలేదని, ఆవు కల్తీ అయిందంటూ సరికొత్త భాష్యం చెప్పారు. లడ్డూ వివాదంపై ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ, 'పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి ఆవాలు, అవిశలు, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకొనే ఆవుల పాల నుంచి తయారు చేసే నెయ్యి కావొచ్చు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారు. మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? పరీక్షలో ఖచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్‌బీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఉన్న లోపాలేంటి, జరిగిందేంటి అనేది తెలుసుకోవాలి. ఎంతో భద్రతగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడి విలువను మనమే తగ్గించుకోవడం అవుతుంది. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చింది' అని తమ్మినేని సీతారాం విమర్శించారు.
శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق