తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ మెట్రో రైళ్లు రానున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్ సిటీ స్థానంలో వందేమెట్రో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేమెట్రో నడిపే రూట్లను అధికారికంగా ఖరారు చేసారు. చెన్నై- తిరుపతి మధ్య తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే మెట్రోగా పట్టాలెక్కనుంది. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్ - విజయవాడ మధ్య కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రూటులో నడుస్తున్న ఇంటర్ సిటీ స్థానంలో అదే సమయంలో ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు మరింత పెరగనున్నాయి.100 నుంచి 350 కిలో మీటర్ల దూరం ఉండే రెండు ప్రధాన నగరాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ఠ వేగం 110 కిలో మీటర్లుగా ఉంటుంది. ఇవి పూర్తి ఏసీ రైళ్లు. భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నారు. ఈ రైళ్లల్లో కనీస ఛార్జీ రూ 30 కాగా, దూరాన్ని బట్టి గరిస్ఠ ఛార్జీ (350 కిలో మీటర్లు) రూ 445గా నిర్ణయించారు. ఈ రైళ్లల్లో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ప్రయాణికులను అనువైన సీటింగ్ ఉంటుంది.ఈ రైలులో నాలుగేసి బోగీలు ఓ యూనిట్ గా ఉండగా, ఒక రైలులో కనీసం 12 బోగీలు ఉంటాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బోగీలను 16కు పెంచే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ తరహాలో వందేమెట్రో కు సైతం ఆదరణ వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم