మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి చేసింది. ఇద్దరు వ్యక్తులు రహదారి పక్కన కూర్చుని ఉన్నారు. అంతలో పొదల్లో నుంచి వచ్చిన ఓ తోడేలు వారిపై దాడికి యత్నించింది. వెంటనే వారిద్దరు స్పందించారు. అనంతంర తోడేలుపై వారు ఎదురు దాడికి దిగారు. ఇది సమీపంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అందుకు సంబంధించిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున మరో తోడేలును అటవీ శాఖ అధికారులు బంధించారు. దీంతో ఇప్పటి వరకు బంధించిన తోడేళ్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే మరో తోడేలు మాత్రం తప్పించుకుందని తెలిపారు. ఈ తోడేలును సైతం సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
0 Comments