వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ నెలకొంది. దువ్వాడ వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంత కాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు యత్నిస్తున్నారు. అంతేకాదు, అక్కడే మకాం పెట్టారు.. గత నెల రోజుల నుంచి ఇంటి బయటే ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు.. అయితే, ఆ ఇంటిలోకి ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటికి చేరుకోవడంతో ఇంటి ఆవరణలో నెలరోజులుగా నిరసన తెలుపుతున్న దువ్వాడ భార్య , బిడ్డల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంగా ప్రకటించుకున్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంట్లోకి ప్రవేశించేందుకు వాణికి కోర్టు అనుమతి ఇవ్వగా, వివాధానికి కేంధ్ర బిందువైన ఇంటిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాదురి పేరుతో రిజిష్ర్టేషన్ చేసేసారు. గత నెలరోజులుగా అదే ఇంటి బయట అందోళన చేస్తున్న వాణి , దువ్వాడ కుమార్తెలు బందువుల సహాయంతో ఇంటిలొకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم