హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడ చౌరస్తాలో శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు పైనుంచి దూసుకెళ్లడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం తెలుస్తోంది. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ప్రయాణికులు ఒక్కొక్కరుగా రోడ్డు దాటుతున్నారు. అందరిలానే ఆ యువతి కూడా రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సును ఆమె గమనించలేదు. చివరకు చేయి పైకెత్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేసేలోపే ఆమెపై నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ యువతి బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ముందున్న యువతిని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆమె పైనుంచి బస్సును తీసుకెళ్లడంతోనే ఈ ఘోరం జరిగింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో యువతిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు !
السبت، 14 سبتمبر 2024
Criem telangana ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కొత్తగూడ చౌరస్తాలో బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది హైదరాబాద్లో యువతిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ليست هناك تعليقات:
إرسال تعليق