రాజస్థాన్‌ గవర్నర్‌ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం మాట్లాడుతూ తాను ఆరెస్సెస్స్‌ కార్యకర్తగా పనిచేసిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ''ఆరెస్సెస్‌ కార్యకర్తగా పనిచేసిన రోజుల్లో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నా. ఒకప్పుడు తగిన గుర్తింపు గానీ, గౌరవం గానీ ఉండేవి కాదు. హరిభౌ కిసన్‌రావ్ బగాడే వంటి నేతలు మాత్రం ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశారు. పార్టీ కార్యకర్తగా నేను 20 ఏళ్ల పాటు విదర్భలో పనిచేశా. అప్పట్లో మేం నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు రువ్వేవారు. ఎమర్జెన్సీ తర్వాత నేను ప్రసంగాలు చేయడానికి వినియోగించే ఆటోను కొందరు తగలబెట్టేశారు'' అంటూ నాటి రోజులను గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ''ఇవాళ నేను మాట్లాడుతుంటే.. వేలాది మంది ఇక్కడికి వచ్చి వింటున్నారు. ఇవాళ నాకు దక్కిన ఈ గుర్తింపు వాస్తవానికి నాది కాదు. ప్రాణాలకు ఎదురొడ్డి మరీ కష్టపడిన హరిభౌ కిషన్‌ రావ్‌ వంటి కార్యకర్తలదే'' అని గడ్కరీ పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم