ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజినీపై పల్నాడు జిల్లా యడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. తమ నుంచి రజనీ, ఆమె పీఏ గోపి రూ.2.50 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి అనితవిచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి రజిని అక్రమాలు ఇటీవల ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జగనన్న కాలనీ పేరిట తమ వద్ద భూములు సేకరించి కమీషన్ వసూలు చేశారని, అవి ఇప్పించాలని జూన్‌లో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు మొరపెట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు, గుడిపూడి గ్రామాల రైతుల నుంచి 200 ఎకరాలను మాజీ మంత్రి రజిని అనుచరులు సేకరించారు. 32 మంది నుంచి తొలుత 50 ఎకరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తమకు రజిని నుంచి రూ.1.16 కోట్లు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు, ఎంపీకి విన్నవించుకోగా ఆ మొత్తాన్ని ఇప్పించారు.
విడదల రజినీపై ఫిర్యాదు : విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق