Ad Code

కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పవన్ కల్యాణ్‌పై ప్రశ్న?


మితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పవన్ గురించి ప్రశ్న అడిగారు. ఓ వృద్ధ జంట హాట్ సీట్లో కూర్చొని ఉండగా జూన్ 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం అయిన నటుడు ఎవరు అని వారికి ప్రశ్న వేస్తాడు అమితాబ్. ఆప్షన్స్‌గా A. పవన్ కళ్యాణ్ B. చిరంజీవి, C. నాగార్జున , D. నందమూరి బాలకృష్ణ అనే పేర్లు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ కోసం ఆ జంట ఆడియెన్స్ పోల్‌ను ఎంచుకోగా 50 శాతం మందికి పైగా ఓట్లు పవన్‌ పేరుకే వస్తాయి. దీంతో ఆ జంట కూడా పవన్ పేరునే సెలెక్ట్ చేస్తుంది. ఇది రైట్ ఆన్సర్ అని చెప్పిన అమితాబ్ మీరు రూ.లక్షా 60 వేలు గెలుచుకున్నారని ప్రకటిస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ వివరిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడని, ప్రముఖ నటుడు చిరంజీవికి సోదరుడని చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu