తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకి చెందిన ఏఆర్ డెయిరీకి నోటీసులు ఇచ్చింది. నెయ్యి కల్తీ పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుమలకు జూన్, జూలైలో ఏఆర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. అందులో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అయితే, తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఏఆర్ డెయిరీ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. తిరుమల లడ్డూ తయారీలో వాడేందుకు కోసం టీటీడీకి నెయ్యిని సప్లయ్ చేసిన ఏఆర్ డెయిరీ సంస్థకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులోని ఏఆర్ డెయిరీ సంస్థ కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. ఆ సోదాల్లోనూ కొంత కల్తీ నెయ్యి లభ్యమైనట్లుగా తెలుస్తోంది. తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం ఇప్పటికే జోక్యం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరడం జరిగింది.
ఏఆర్ డెయిరీకి నోటీసులుఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు జారీ !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق