ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాలో సీఆర్‌డీఏ డబ్బులు జమ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని ఇస్తున్నారు. పదేళ్లపాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగియడంతో మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.
إرسال تعليق