ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష తన అనుమతి లేకుండానే ఫొటో దిగడం తప్ప చేసిందేంటనీ స్థానిక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినేశ్ పోగట్ ప్రశ్నించింది. "నాకు ఎలాంటి మద్దతు లభించిందో నాకైతే తెలియదు. పీటీ ఉష మేడమ్ హాస్పిటల్ కు వచ్చి ఓ ఫొటో తీసుకుంది. తెర వెనుక రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటాం కదా, పారిస్ లోనూ రాజకీయాలు జరిగాయి. అందుకే నాకీ గుండెకోత. ఎందుకు రెజ్లింగ్ వదిలేస్తున్నవని చాలా మంది అడుగుతున్నారు. కానీ ఎవరి కోసం నేను కొనసాగాలి. ఎక్కడ చూసినా రాజకీయాలే" అని కాంగ్రెస్ లో చేరిన వినేశ్ చెప్పింది. "నేను హాస్పిటల్ బెడ్ పై ఉన్నాను. బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. జీవితంలో చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. అలాంటి సమయంలో నాకు మద్దతు నిలిచానని చెప్పడానికి ఏదో నా పక్కన నిలబడి నా అనుమతి లేకుండానే ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మద్దతు తెలిపేది ఇలా కాదు. కేవలం పోజులివ్వడమే" అని వినేశ్ కామెంట్స్ చేసింది.
0 Comments